హెచ్‌ఐవీ రోగులకు శుభవార్త
- October 30, 2017
హెచ్‌ఐవీ.. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను ముప్పు తిప్పులను పెడుతున్న వైరస్. ఇది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటుండడంతో విజయం సాధించలేకపోతున్నారు. ఇప్పుడు అమెరికాలోని మేరీలాండ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. హెచ్‌ఐవీ చుట్టూ ఉన్న రక్షణ పొరను ఛేదించే ప్రొటీన్‌ను తయారు చేశారు. సాధారణంగా వైరస్ వివిధ రూపాల్లోకి మారినప్పుడు దాని రక్షణ పొరలో ఉన్న ప్రొటీన్లు కూడా మారుతుంటాయి. ఇప్పటివరకు హెచ్‌ఐవీలో మొత్తం 60 రకాల ప్రొటీన్లను గుర్తించారు. మేరీలాండ్ శాస్త్రవేత్తలు వివిధ రూపాల్లోని వైరస్ పొరలను పరిశీలించగా జీపీ-120 అనే ప్రొటీన్ అన్నింటిలో ఉన్నట్టు గుర్తించారు. దీంతో జీపీ-120ని గుర్తించి నాశనం చేసే రసాయనాన్ని తయారు చేశారు. దానిని కుందేళ్లలో పరీక్షించగా సత్ఫలితాలు వచ్చాయి. దీంతో పూర్తిస్థాయి ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!