ఎంబసీ జోన్లో అలజడి

- October 31, 2017 , by Maagulf
ఎంబసీ జోన్లో అలజడి

కాబూల్: అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన కాబూల్ దౌత్యకార్యాలయ జోన్‌ సమీపంలో మంగళవారం ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. పేలుడు ధాటికి ఆ సమీపంలోని కార్యాలయాల తలుపులు, అద్దాలు పగిలిపోయాయి. వివిధ రాయబార కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే ఉండటంతో ఒక్కసారిగా భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. ఈ పేలుడులో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది వరకు గాయపడినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com