విజయనగరం జిల్లా చీపురుపల్లి బీసీ హాస్ట్‌ల్‌ విద్యార్థులకు మద్యం తాగించిన హాస్టల్ సిబ్బంది

- November 01, 2017 , by Maagulf
విజయనగరం జిల్లా చీపురుపల్లి బీసీ హాస్ట్‌ల్‌ విద్యార్థులకు మద్యం తాగించిన హాస్టల్ సిబ్బంది

విద్యా బుద్ధుల నేర్పి... పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన హాస్టల్‌ సిబ్బంది దారి తప్పుతున్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా అర్థంకాక అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి బీసీ హాస్ట్‌ల్‌ వార్డెన్‌లో 10వ తరగతి వరకు విద్యార్థులు ఉంటున్నారు. రెండు రోజుల క్రితం వార్డెన్‌ హాస్టల్‌లో లేకపోవడంతో... అక్కడ పనిచేసే సిబ్బంది ఫుల్లుగా మందు కొట్టారు. అలాగే హాస్టల్‌కు వచ్చారు. మళ్లీ మరోసారి తాగారు. 

తాగిన మైకంలో మిగిలిన లిక్కర్‌ను జ్యూస్‌లో కలిపారు. పిల్లల్ని పిలిచి తాగమని చెప్పారు. విషయం తెలియక వాళ్లు తాగి వెంటనే పడిపోయారు. తోటి విద్యార్థులు విషయాన్ని వార్డెన్‌కు చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా మద్యం తాగినట్లు తేలింది. మొత్తం ఘటనపై ఆరా తీస్తే హాస్టల్‌ సిబ్బంది నిర్వాకం బయటపడింది. వార్డెన్‌ వెంటనే విషయాన్ని బీసీ సంక్షేమశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకొని విచారణ చేపట్టారు. సిబ్బందిని నిలదీయగా... చేసిన తప్పును ఒప్పుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com