వెజిటబుల్ లడ్డు
- November 01, 2017కావలసిన పదార్థాలు : క్యారెట్ తురుము-1 కప్పు, బీట్రూట్ తురుము-1 కప్పు, కొబ్బరి తురుము-1 కప్పు, బొంబాయి రవ్వ-1 కప్పు, పంచదార-3 కప్పులు, నెయ్యి-3 కప్పులు, బాదం జీడిపప్పు ముక్కలు-ఒక కప్పు, యాలకుల పొడి-ఒక టీస్పూన్.
తయారుచేసే విధానం : స్టవ్‌పై మందపాటి గిన్నె ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసి బొంబాయి రవ్వను దోరగా వేయించి ఒక ప్లేటులో ఉంచుకోవాలి. గిన్నెలో మరికాస్త నెయ్యి వేసి కొబ్బరి, క్యారెట్, బీట్రూట్ తురుము వేసి సన్నటి మంటపై అయిదు నిమిషాలు వేగించాలి. తర్వాత పంచదార వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి. గడ్డ కట్టకుండా గరిటెతో మధ్య మధ్యన తిప్పాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి చల్లారాక అర చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని లడ్డూలు చేసుకోవాలి.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..