ముంబై లో సొంత ఇల్లు తీసుకున్న కుమారి 21ఎఫ్

- November 02, 2017 , by Maagulf
ముంబై లో సొంత ఇల్లు తీసుకున్న కుమారి 21ఎఫ్

అలా ఎలా అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన హెబ్బా పటేల్.. కుమారిగా యువతను ఆకట్టుకొన్నది. హెబ్బా పటేల్ తాజా సినిమా ఏంజిల్ నవంబర్ 3 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ నేపద్యంలో హెబ్బా మీడియా తో మాట్లాడుతూ.. తన కొత్త సినిమా ఏంజిల్ గురించి.. తన సినీ కెరీర్ గురించి అనేక విషయాలను పంచుకొన్నది. 
కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత టైటిల్ రోల్ పోషించిన సినిమా ఏంజిల్ అని చెప్పింది. అంతేకాదు.. ఈ సినిమాలో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎంతో కష్టపడ్డాం.. అని చెప్పింది. అంతేకాదు.. ఈ సినిమాలో తాను దేవ కన్యలా కనిపించనున్నట్లు తెలిపింది.. దేవలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చాను..? హీరో ని ఎందుకు కలిశాను వంటి అంశాలు చాలా ఆసక్తిగా ఉంటాయి అని చెప్పింది. అంతేకాదు.. తాను ముంబై లో ఓ ఇల్లును కొనుక్కొన్నట్లు.. ఆ ఇంటి పనులు చూసుకుంటున్నట్లు చెప్పింది.. నా సినీ కెరీర్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా.. గత కొంత కాలంగా ఖాళీలేకుండా నటిస్తున్నా.. అందుకని కొంత కాలం విరామం తీసుకొని.. ఆపై కొత్త సినిమాలను అంగీకరించాలను కొంటున్నట్లు చెప్పింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com