తమిళనాడులో భారీ వర్షాలు
- November 02, 2017
తమిళనాడును వర్షాలు వణికిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా పడుతున్న వానలకు చెన్నై సహా పలు జిల్లాలు తడిసిముద్దవుతున్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఉదయం కురిసిన వానకు చెన్నైలోని పలు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు.
మరోవైపు వచ్చే రెండు రోజుల్లో చెన్నై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరింది. ఇప్పటికే తిరువళ్లూరు జిల్లాలో 10 సెంటీ మీటర్ల వర్షం కురిసిందని అధికారులు చెప్పారు. ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలో రావడంతో అధిక వర్షపాతం నమోదౌతోందని చెన్నై వాతావరణ శాఖ డైరెక్టర్ బాల చంద్రన్ తెలిపారు. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశమున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని సూచించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!