రోహిత్ శర్మ ఆల్‌టైమ్ రికార్డు
- November 02, 2017
హైదరాబాద్: ఢిల్లీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుని అందుకున్నాడు. బుధవారం ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరిగిన తొలి టీ20లో రోహిత్ శర్మ 55 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో ఇప్పటి వరకు అత్యధిక సిక్స్‌లు నమోదు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఢిల్లీ టీ20లో రోహిత్ శర్మ నాలుగు సిక్సర్లు సాధించడం ద్వారా 267వ టీ 20 సిక్సర్ అతడి ఖాతాలో చేరింది.
ఈ మ్యాచ్‌కు ముందు 265 సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉన్న సురేశ్ రైనా రికార్డుని రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. ఆ తర్వాతి స్ధానాల్లో యువరాజ్ సింగ్ (244), ధోనీ (226), యూసుఫ్ పఠాన్ (221), విరాట్ కోహ్లీ (217) ఉన్నారు. ఈ జాబితాలో వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ తొలి స్థానంలో ఉన్నాడు.
309 టీ20 మ్యాచ్‌లాడిన క్రిస్ గేల్ 772 సిక్సర్లతో
రోహిత్ శర్మ సిక్సర్ల జోరు
ఇప్పటివరకు 309 టీ20 మ్యాచ్‌లాడిన క్రిస్ గేల్ 772 సిక్సర్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇదిలా ఉంటే, టీ20ల్లో భారత్ విజయం సాధించిన మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో భారత్ ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. 41 మ్యాచ్‌ల్లో పది హాఫ్ సెంచరీలతో రోహిత్ శర్మ 1010 పరుగులు చేశాడు.
1322 పరుగులతో అగ్రస్ధానంలో
అగ్రస్ధానంలో కోహ్లీ
ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 34 మ్యాచ్‌ల్లో 69.57 యావరేజితో 1322 పరుగులతో అగ్రస్ధానంలో ఉన్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన మూడో వన్డే అనంతరం వన్డేల్లో అత్యంత వేగంగా 150 సిక్సులు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్ధానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అగ్రస్థానంలో
వన్డేల్లో అత్యంత వేగంగా 150 సిక్స్‌ల రికార్డు
ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అగ్రస్థానంలో ఉన్నాడు. షాహిద్ అఫ్రిది 164 మ్యాచ్‌ల్లో 160 ఇన్నింగ్స్‌ల ద్వారా అత్యంత వేగంగా 150 సిక్స్‌లు నమోదు చేశాడు. కాన్పూర్‌లోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 147 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో 18 ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి
165 ఇన్నింగ్స్‌ల్లో 150 సిక్స్‌ల మైలురాయి
ఇందులో 18 ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. ఈ వన్డేలో రెండు సిక్సులు బాదడంతో రోహిత్ శర్మ సాధించిన సిక్సుల సంఖ్య 150కి చేరింది. 171 మ్యాచ్‌ల్లో 165 ఇన్నింగ్స్‌ల ద్వారా రోహిత్ శర్మ 150 సిక్స్‌లను మైలురాయిని అందుకున్నాడు. ఇది భారత తరపున అత్యంత వేగవంతమైన సిక్సుల రికార్డు.
టీ20 క్రికెట్లో
టీ20 క్రికెట్లో భారత్ తరుపున అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్ల జాబితా:
267 - రోహిత్ శర్మ
265 - సురేశ్ రైనా
244 - యువరాజ్ సింగ్
226 - మహేంద్ర సింగ్ ధోని
221 - యూసఫ్ పఠాన్
214 - విరాట్ కోహ్లీ
భారత్ తరఫున టీ20ల్లో ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం
తొలి వికెట్‌కు 158 పరుగులు జోడించిన భారత ఓపెనర్లు
మరోవైపు న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ-ధావన్ తొలి వికెట్‌కు 158 పరుగులు జోడించారు. భారత్ తరఫున టీ20ల్లో ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇదిలా ఉంటే ఇరు జట్ల మధ్య రెండో టీ20 రాజ్ కోట్ వేదికగా శనివారం (నవంబర్ 4) జరగనుంది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు