మాజీ భార్య.. భర్త తాజా భార్యని 'జంతువు' ' చెత్త ' అని వాట్స్అప్ లో దూషణ

- November 02, 2017 , by Maagulf
మాజీ భార్య.. భర్త తాజా భార్యని   'జంతువు'  ' చెత్త ' అని వాట్స్అప్ లో దూషణ

దుబాయ్ : '  చెవి వద్ద జోరీగ మోత  ...చెప్పు లోని రాయి..ఇల్లాలి పోరు ఇంతిథి కాదయా ' మన యోగి వేమన ఏనాడో సెలవిచ్చారు. భర్త నుంచి విడిపోయిన తర్వాత సైతం ఆ  మాజీ భార్య నీడలా వెంటాడింది. సామాజిక మాధ్యమాలలో తన మాజీ భర్త తాజా భార్యని పచ్చి బూతులతో సతాయిస్తుంది. భర్త నుంచి విడిపోయిన ఆమె ఎంతో అవమానకరమైన పదాలతో దూషించడంలో మరియు బెదిరించడంలో ఆరితేరింది. ఆమె ప్రతివాది 40 ఏళ్ళ ఎమిరాటీ  ప్రస్తుతం దుబాయ్ లో నివసించడం లేదు. న్యాయవాది ఆయామం  అబ్దుల్  హకం ఆ మహిళకు రెండు నెలల జైలు శిక్ష విధించారు. గత ఏడాది ఆమె భర్త ఆ మహిళకు విడాకులు ఇచ్చి మరో వివాహం చేసుకొన్నాడు.  బాధితురాలు ఎమిరాటీ,ఆమె వయస్సు పేర్కొనబడలేదు, ఆగష్టు 7, 2016 న ఆమె అధికారి ఫోన్ నంబర్ నుండి మొదటి వాట్స్ అప్  సందేశాన్ని అందుకుంది. ఆ సందేశంలో పచ్చి బూతులు కలిగి ఉంది. కానీ ఆమె స్పందిస్తుంది లేదు. ఆ రోజు నుండి ఈ సంవత్సరం ఆగష్టు నెల వరకు  వరకు ఆమె రెండు మొబైల్ నంబర్లకు అనేక అసభ్యకరమైన సందేశాలను అవమానకరమైన భాషలో తన  మొబైల్ ఫోన్లకి అనుచిత ఫోటోలు పంపించబడ్డాయి. దొరకకుండా ఉండదెందుకు 11 సంఖ్యల నెంబర్ నుండి ఫోన్ల సందేశాలు వచ్చేవని ఆమె తన భర్తతో చెప్పిన తరువాత వారు ఇరువురు  పోలీసులకు ఆ సందేశాలపై పిర్యాదు చేశారు  "ఆమె నన్ను జంతువు అని , చెత్త మొఖం దానినని, ఇంటి దొంగ నని, నీ భర్త పెద్ద దొంగ అని, కుళ్ళిన కుక్క వంటి ఎన్నోచెడ్డ పదాలు ఉపయోగిస్తున్నట్లు గుడ్ల నీరు కుక్కుకొంటూ ఆ సందేశాలన్ని పోలీసుల ఎదుట చూపించి నిరూపించింది. దీంతో పోలీసులు ఆ మాజీ భార్యని ప్రశ్నించడం కోసం అల్ క్కుసైస్  పోలీసు స్టేషన్ కు హాజరుజావాలని చెప్పారు. పోలీస్ స్టేషన్ లో దూషణ సందేశాలు పంపినట్లు ఆ మహిళ తన నేరాన్ని ఒప్పుకుంది. ఆ నిందితురాలు నుంచి పోలీసులు  పలు మొబైల్ ఫోన్లు మరియు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళే అవమానకరమైన  మరియు బూతు చిత్రాలు పంపినట్లు ధ్రువీకరించారు. అయినప్పటికీ, ఆమె ప్రాసిక్యూషన్ ఎదుట జరిగిన పలు సమావేశాలకు హాజరు కాలేదు మరియు కోర్టు ఎదుట స్పందించడంలో  విఫలమైంది. దీంతో  ఆమెపై పలు అభియోగాలు నమోదయ్యాయి. వీటిపైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటె ఆమె 14 రోజులలో న్యాయస్థానానికి  విజ్ఞప్తి చేయవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com