సచిన్ టెండూల్కర్ ను మ్యాచ్ చూసేందుకు ఆహ్వానించినా కేరళ సీఎం
- November 03, 2017
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గురువారం (నవంబర్ 2)న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కలిశాడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగంగా కేరళ బ్లాస్టర్స్ టీమ్ గురించి ముఖ్యమంత్రికి వివరించడానికి ఇక్కడికి వచ్చినట్లు సచిన్ చెప్పాడు.
ఐఎస్ఎల్లో కేరళ బ్లాస్టర్స్ జట్టుని సచిన్ టెండూల్కర్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. లీగ్‌లో భాగంగా కేరళ జట్టు తమ తొలి మ్యాచ్ నవంబర్ 17న ఆడుతుంది. ఈ మ్యాచ్ చూసేందుకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిని సచిన్ కోరినట్లు తెలిపాడు.
ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో సచిన్ వెంట భార్య అంజలి కూడా ఉన్నారు. ఈ జట్టుకు సచిన్‌తోపాటు టాలీవుడ్ హీరోలు చిరంజీవి, నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ సహ యజమానులుగా ఉన్నారు. ఇండియన్ సూపర్ లీగ్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. పది నగరాలు ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి.
తాజా వార్తలు
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్‌లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్‌గ్రౌండ్‌లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం