ప్రపంచ వ్యాప్తంగా ప్రజల వాట్సాప్ కష్టాలు

- November 03, 2017 , by Maagulf
ప్రపంచ వ్యాప్తంగా ప్రజల వాట్సాప్ కష్టాలు

ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ యూజర్లు ఉదయం నుంచి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇటలీ, సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్, జర్మనీ, అమెరికా, శ్రీలంకతోపాటు భారత్‌లోనూ వాట్సప్ సర్వీస్ డౌన్ అయింది. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి వాట్సప్ సర్వీసులకు తీవ్రం అంతరాయం ఏర్పడింది. వేలాది మంది వాట్సప్ కస్టమర్లు తమ అసౌకర్యం గురించి వాట్సప్ యాజమాన్యానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదుల్లో 60 శాతం వాట్సప్ సర్వీస్ కనెక్టింగ్‌కు సంబంధించినవి కాగా.. 25శాతం మెసేజ్‌లు రిసీవ్ చేసుకోవడం గురించి, 14శాతం యాప్ లాగిన్‌కు సంబంధించిన ఫిర్యాదులని యాజమాన్యం తెలిపింది. అయితే ఈ సమస్య అందరు యూజర్లకు లేదనీ, కొంతమంది యూజర్లకు వాట్సప్ బాగానే కనెక్ట్ అవుతున్నట్లు నెటిజన్లు చెబుతున్నారు. కాగా తమకు వేలాదిగా వస్తున్న ఫిర్యాదులను వాట్సప్ టెక్నికల్ టీమ్ విశ్లేషిస్తోంది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఉదయం నుంచి ఈ అంశం గురించి సోషల్ మీడియాలోనూ, ట్విటర్‌లోనూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వాట్సప్ సర్వీస్ డౌన్ అయిందంటూ తమ మిత్రులకు సమాచారాన్ని చేరవేస్తున్నారు.

ఇలాంటి సమస్య వాట్సప్‌ నుంచి రావడం ఇదే మొదటిసారని చర్చించుకుంటున్నారు. చాట్ కాంటాక్ట్స్ ఓపెన్ అవుతున్నా.. మెసేజ్‌లు రావడం, సెండ్ అవడం వంటి సర్వీసులు నిలిచిపోయాయి. ఉదయం నుంచి 'కనెక్టింగ్' అనే మెసేజ్‌ను మాత్రమే చూపిస్తోంది.

డెస్క్‌టాప్‌కు వాట్సప్‌ను కనెక్ట్ చేసి సర్వీసులను వినియోగించడం కూడా కుదరడం లేదని నెటిజన్లు వాపోతున్నారు. ఫేస్‌బుక్‌లా యూజర్లు అంతా కనెక్ట్ అవడానికి సోషల్ మీడియా పేజ్ లేకపోవడంతో వాట్సప్ సర్వీసుల్లో కలుగుతున్న అంతరాయం గురించి యాజమాన్యానికి చెప్పేందుకు, లేక యాజమాన్యం ఏదైనా సమాచారాన్ని ఇచ్చేందుకు వీలులేకుండా పోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com