ప్రభుత్వ రంగ రవాణా సంస్థ గ్రీన్ బాండ్లు జారీ
- November 08, 2015
పర్యావరణరహిత ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధులను సేకరించేందుకు భారత రైల్వేశాఖ గ్రీన్ బాండ్లను జారీ చేయనుంది. ప్రభుత్వ రంగ రవాణా సంస్థ గ్రీన్ బాండ్లను జారీ చేయడం ఇదే తొలిసారి కానుంది. దీనిపై రైల్వేశాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ... గ్రీన్ బాండ్లపై కసరత్తు జరుగుతోందని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. సంప్రదాయ ఇంధన వాడకాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా రైల్వే శాఖ సోలార్, పవన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయతలపెట్టినట్టు గుర్తు చేశారు. విద్యుత్ ఉత్పత్తి కోసం రైళ్లు, రైల్వే స్టేషన్ల పైభాగంలోనూ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని బోగీలు, రైల్వే ఫ్లాట్‌ఫాంలు సోలార్ విద్యుత్ ఆధారంగా నడుస్తున్నాయి. రైల్వే శాఖ అభివృద్ధి పనుల కోసం కేంద్ర సాయంపై ఆధారపడకుండా నిధులు సేకరించేందుకు ఇతర మార్గాలను అన్వేషించే చర్యల్లో భాగంగా ఈ గ్రీన్ బాండ్లను జారీ చేయనుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







