హీరో కళ్యాణ్ రామ్ రీల్ లైఫ్ లో ప్రజెంట్ తాను నటిస్తున్న ఎమ్.ఎల్.ఎ మూవీ

- November 04, 2017 , by Maagulf
హీరో కళ్యాణ్ రామ్ రీల్ లైఫ్ లో ప్రజెంట్ తాను నటిస్తున్న ఎమ్.ఎల్.ఎ మూవీ

నందమూరి కళ్యాణ్ రామ్ పార్టీ పెట్టాడు.. నిజమే కానీ రియల్ లైఫ్ లో కాదు. రీల్ లైఫ్ లో. ప్రజెంట్ తాను నటిస్తున్న ఎమ్.ఎల్.ఎ మూవీలో కథలో భాగంగా పార్టీ పెట్టాడట. ఆ పార్టీ గుర్తు టాప్. ఎమ్.ఎల్.ఎ అనే టైటిల్ కి ట్యాగ్ లైన్ గా మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అని పెట్టారు. దీంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ ఏర్పడింది. 

కళ్యాణ్ రామ్ హీరోగా ఉపేంద్ర డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ, ప్రజెంట్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ఆ పోస్టర్ లో కళ్యామ్ రామ్ కొత్త పార్టీ, టాప్ గుర్తు హైలైట్ అయ్యాయి. అయితే ఈ పిక్ ని ఎవరైనా క్రియేట్ చేశారా... లేక నిజంగా సినిమాలోనిదేనా అనే విషయం ఇప్పుడు చెప్పలేం.  ఎమ్.ఎల్.ఎ పై కళ్యాణ్ రామ్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com