కువైట్‌లో రాజకీయ సంక్షోభం

కువైట్‌లో రాజకీయ సంక్షోభం

కువైట్:  ఓ పార్లమెంట్ సభ్యుడిపై ఓ కేసులో విచారణకు ఆదేశాలివ్వడమే ఈ సంక్షోభానికి అసలు కారణం. పార్లమెంట్ సమావేశాలు మొదలైన వారం రోజుల్లోనే ఇదంతా జరిగిపోవడం గమనార్హం. పార్లమెంట్ సభ్యుడిపై విచారణ జరగనుండటంతో సభ్యులంతా సోమవారం రాజీనామా ప్రకటించారు. అన్నట్లుగానే  మంత్రులంతా మూకుమ్మడి రాజీనామా చేశారు. దీంతో ప్రధాని కూడా రాజీనామా చేయక తప్పలేదు. పార్లమెంట్‌ను రద్దు చేస్తూ కువైట్ రాజు నిర్ణయం తీసుకున్నారు.కువైట్ చట్టాల ప్రకారం మంత్రులంతా రాజీనామా చేస్తే ప్రధాని కూడా రాజీనామా చేయక తప్పదు. దీంతో ప్రధాని కూడా తన రాజీనామాను గురువారం కువైట్ రాజు జబెర్ అల్ అహ్మద్ అల్ శబహ్‌కు అందజేశారు. కువైట్ రాజు ఆయన రాజీనామాను ఆమోదించారు. తదుపరి ప్రధాని, క్యాబినెట్‌ను ఎంపిక చేసేవరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని కోరారు. అయితే కొత్త ప్రధానిని ఎంత కాలంలో ఎంపిక చేస్తారనేది తెలియరాలేదు. కువైట్ చట్టాల్లో ఆ కాల పరిమితిని సూచించకపోవడంతో కొన్ని నెలలపాటు ప్రధాని లేకుండానే పాలన జరిగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Back to Top