హైదరాబాద్ లో పర్యటించనున్న ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్
- November 05, 2017
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఈ నెల 28, 29 తేదిల్లో హైద్రాబాద్‌లో పర్యటించనున్నారు. ఇవాంకా రాక కోసం హైద్రాబాద్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజ్ ఫలక్‌నుమాలో ఇవాంకాకు డిన్నర్ ఏర్పాటు చేయనున్నారు.
ఇవాంకా పర్యటనను పురస్కరించుకొని భద్రతా ఏర్పాట్లపై అమెరికా అధికారులు , తెలంగాణ ఇంటలిజెన్స్ అధికారులు ఫలక్‌నుమా ప్యాలెస్‌ను సందర్శించారు. ఈ ప్రాంతంలోని రోడ్డు మార్గాన్ని కూడ పరిశీలించారు.
హైద్రాబాద్‌లో జరిగే గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్‌కు వస్తున్నారు.ఇవాంకా పర్యటన ముగిసేంతవరకు మాదాపూర్‌లోని రహేజా మైండ్ స్పేస్‌లో బస చేస్తారు.
ఇవాంకా కోసం దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత కోసం 'ఆక్టోపస్' కూడా బరిలోకి దిగనుంది. ఇప్పటినుంచే ఫలక్‌నుమా పరిసర ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతు పనులు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







