కువైట్ లో భారత రాయబారి సునీల్ జైన్ కు భారత పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అధికారులు వీడ్కోలు
- November 05, 2017
కువైట్ : భారత ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కు చెందిన ముఖ్యాధికారులు నవంబర్ 1 వ తేదీ 2017 న అల్-మురాజన్ బాంకెట్ హాల్, హోటల్ క్రౌన్ ప్లాజాలో భారత్ రాయబారి శ్రీ సునీల్ జైన్ కు వీడ్కోలు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కువైట్ లో భారత రాయబారి సునీల్ జైన్ అక్టోబర్ చివరికి విరమణ పొందారు. ఎయిర్ ఇండియా, అశోక్ ఆంగ్రల్, టిసిఐఎల్, సిద్దార్థ ముఖర్జీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కో, రామ్ మోహన్ రెడ్డి, న్యూ ఇండియా అస్యూరెన్స్, అరుణ్ జైరామ్, దేవ్ష్ కుమార్, ఎల్ ఐ సి ,రాజీవ్ సాకుజ పాల్గొన్నారు.భారతదేశం యొక్క రాయబారిగా తన పదవీకాలంలో శ్రీ సునీల్ జైన్ యొక్క మంచితనం మరియు సాధించిన ఘనత గురించి మాట్లాడారు. తన వీడ్కోలు ప్రసంగంలో జైన్ కృతజ్ఞతలు తెలియచేసారు. పలువురు భారతీయ పౌరులకు సహాయం చేసేందుకు అవసరమైన చర్యలు మరియు బాధ్యతలను ప్రదర్శిస్తున్నప్పుడు తానూ ఎదుర్కొన్న సవాళ్లు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇతర సీనియర్ ఆఫీసర్లు ఇండియన్ ఎంబసీ వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







