మలేషియాను వణికిస్తున్న డామ్రే తుఫాన్
- November 06, 2017
డామ్రే తుఫాన్ వియత్నాం, మలేషియాలను వణికిస్తోంది. వారం రోజులుగా కుండపోత వానలు, పెను గాలులు విరుచుకుపడుతున్నాయి. ఈ పెను బీభత్సానికి 32మంది చనిపోయారు. ముఖ్యంగా వియత్నాంలో పరిస్థితి దారుణంగా ఉంది. గంటకు 130 కిలోమీటర్లు వేగంతో వీస్తున్న గాలులతో 40వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లన్నీ చెరువుల్లా మారాయి.
వియత్నాంలో ఎక్కడ చూసినా వర్ష బీభత్సం కనిపిస్తోంది. కూలిపోయిన ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా జన జీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వం సహాయక చర్యల్ని ముమ్మరం చేసింది. ఆర్మీని రంగంలోకి దించి జనాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరో నాలుగైదు రోజులు వానలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రెయిన్ అలర్ట్తో జనాలు భయపడిపోతున్నారు.
మలేషియాలోనూ డామ్రే ప్రభావం కనిపిస్తోంది. ఏకధాటిగా 15 గంటల పాటు కురిసిన వర్షానికి కొన్నిచోట్ల 12 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని మూడువేలమందికిపైగా ప్రజల్ని మలేషియా ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!