రూ.100 కోట్ల తో తెలంగాణలో స్కైవిన్ యూనిట్
- November 06, 2017
విపణిలోకి నాలుగు కొత్త మోడళ్లు
వచ్చే ఏడాది నాటికి రూ.100 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో స్మార్ట్‌ఫోన్ పరిజ్ఞానంతో కూడిన మొబైళ్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పబోతున్నట్లు స్కైవిన్ కమ్యూనికేషన్స్ ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల టర్నోవరు సాధించాలని కూడా లక్ష్యంగా సంస్థ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ భీమినేని పెట్టుకున్నట్లు వివరించారు. స్కైవిన్ ఆదివారం విపణిలోకి 4 కొత్త ఫీచర్ ఫోన్ల ( ఐ-9, ఐ-8, ఐ-5, ఐ-1) ను ప్రవేశపెట్టింది. వీటిని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, బేవరేజస్ కార్పొరేషన్ ఛైర్మన్ దేవీప్రసాద్ తదితరులు ఆవిష్కరించారు. సంస్థ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఈ ఫోన్లను అందుబాటులోకి తెచ్చామని, వీటిని 40% క్యాష్‌బ్యాక్‌తో అందిస్తున్నామని సురేష్ భీమినేని తెలిపారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!