పుట్టినరోజు సంబరాలకు దూరం, ప్రజల సేవకే అంకితంః కమల్‌

- November 07, 2017 , by Maagulf
పుట్టినరోజు సంబరాలకు దూరం, ప్రజల సేవకే అంకితంః కమల్‌

నేడు విశ్వనటుడు నటుడు కమల హాసన్ పుట్టినరోజు. ప్రతిఏటా ఆయన పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది రాజకీయ పార్టీ పెట్టనున్న నేపథ్యంలో ఆయన పుట్టిన రోజు వేడుకలు మరింత ఘనంగా జరుగుతాయని, ఈ వేడుకల్లోనే ఆయన రాజకీయ పార్టీ ప్రకటన చేస్తారని అంతా భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కమల్ హాసన్ పుట్టినరోజు వేడుకలను రద్దుచేశారు. ఈ జన్మదినాన ప్రజల సేవకు అంకితమవుతానని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు. జన్మదినాన్ని చెన్నైకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వైద్య శిబిరాన్ని సందర్శించడం ద్వారా జరుపుకోనున్నారు. అనంతరం చెన్నైలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తారు. పుట్టినరోజును పురస్కరించుకుని కమల్ హాసన్ తన పేరిట మొబైల్‌ యాప్‌ సేవలు ప్రారంభించనున్నారు. ఈ యాప్ ద్వారానే ఆయన రాజకీయ ప్రణాళికలు కార్యకర్తలకు వివరించనున్నారు. అలాగే ప్రజా సమస్యలు, కష్టాలు ఈ యాప్ ద్వారా ఆయన విననున్నారు. తన పుట్టినరోజు వేడుకలకు బదులుగా ఏదన్నా సేవచేయాలని, అలా చేయడం ద్వారా మనం కోరుకున్న మార్పు వస్తుందని కమల్ హాసన్ అభిమానులకు పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com