ఇంటింటి ప్రచారానికి అమిత్షా శ్రీకారం
- November 07, 2017
అహ్మదాబాద్: గుజరాత్లో వచ్చే నెల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 'గుజరాత్ గౌరవ్ మహా సంపర్క్ అభియాన్' పేరిట ఆరు రోజుల ప్రచార కార్యక్రమాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. అభివృద్ధి నినాదంతో ఇంటింటికీ ఓటర్లను పలకరించి భాజపాకు ఓటేయాలని అభ్యర్థించారు. 50 వేల పోలింగ్ బూత్ల పరిధిలోని ఓటర్లు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు కాకముందు ఎమ్మెల్యేగా వ్యవహరించిన నారాయణపుర నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని షా ప్రారంభించారు. తొలుత ఇక్కడి అంబాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ సైతం రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు మోదీ రాసిన లేఖలను ఇంటింటికీ వెళ్లి పంచిపెట్టారు. భాజపా అభ్యర్థులకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్ర అసెంబ్లీకి డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 18న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!