ఆస్ట్రేలియన్ కాన్సులేట్ బృందం తో భేటీ అయిన కేటీఆర్‌

- November 07, 2017 , by Maagulf
ఆస్ట్రేలియన్ కాన్సులేట్ బృందం తో భేటీ అయిన కేటీఆర్‌

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ బృందం రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసింది. ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనవర్ షాన్‌కెల్లీ, ఇండియా ఎకనామిక్ స్ట్రాటజీ పీటర్ వర్గీస్‌తో కూడిన ప్రతినిధి బృందం మంత్రితో భేటీ అయింది. సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాలపై మంత్రి కేటీఆర్ ప్రతినిధి బృందానికి వివరించారు. తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతానికి మరింత ప్రయత్నం జరగాలన్నారు. విద్య, వ్యవసాయం, టూరిజం వంటి రంగాల్లో కలిసి పనిచేసేందుకు ముందుకొస్తే పూర్తి సహకారం అందిస్తామన్నారు. రాష్ట్రంలోకి ఆస్ట్రేలియన్ పెట్టుబడులు వచ్చేందుకు సహకరిస్తమని మంత్రి తెలిపారు. ఆస్ట్రేలియన్ ప్రతినిధి బృందం స్పందిస్తూ.. తెలంగాణలో ఉన్న మైనింగ్ అవకాశాల నేపథ్యంలో క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీతో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటును పరిశీలిస్తామమన్నారు. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com