దుబాయ్ ఫ్రేమ్, దుబాయ్ సఫారీ టిక్కెట్ల ధర ఎంతంటే!
- November 07, 2017
దుబాయ్ సఫారీ, దుబాయ్ ఫ్రేమ్ ఎంట్రీ టిక్కెట్ ధరల్ని ప్రకటించారు. దుబాయ్ ఫ్రేమ్‌లోకి ఎంట్రీ టిక్కెట్ ధర పెద్దలకు 50 దిర్హామ్‌లు కాగా, పిల్లలకు 30 దిర్హామ్‌లుగా నిర్ణయించడం జరిగింది. దుబాయ్ సఫారీకి మాత్రం పెద్దలు 50 నుంచి 85 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉండగా, పిల్లలు 20 నుంచి 30 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. దుబాయ్ సఫారీలో ఎంచుకున్న ఎంటర్టైన్మెంట్ని బట్టి ఈ ధరలు ఉంటాయి. మూడేళ్ళ లోపు వయసున్న చిన్నారులకు దుబాయ్ సఫారీలోకి ప్రవేశం ఉచితం. దుబాయ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళేందుకు సందర్శకులకి పేపర్‌లెస్ టిక్కెట్లను అందుబాటులోకి తెస్తున్నారు. ఇ-టిక్కెట్స్ ఈ రెండిటికీ వర్తిస్తాయి. యాప్ ద్వారా ఇ-పేమెంట్ విధానంలో టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. 160 మిలియన్ దిర్హామ్‌లతో దుబాయ్ ఫ్రేమ్‌ని 150 మీటర్ల ఎత్తు, 93 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. ఒక్క నిమిషంలో ఎలివేట్ రైడ్ ద్వారా టాప్‌కి చేరుకుని ఓల్డ్ మరియు న్యూ దుబాయ్‌ని వీక్షించవచ్చు. 1 బిలియన్ దిర్హామ్ ఖర్చుతో రూపొందించిన సఫారీ పార్క్‌లో 5,000కి పైగా జంతువులు, ఇతర జీవులు సందర్శకుల్ని ఆకట్టుకోనున్నాయి. అల్ వర్కా5లో 119 హెక్టార్లలో దీన్ని రూపొందించారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం