ముగ్గురు యువతులతో వ్యభిచారం: తల్లి, కుమార్తెపై కేసుల నమోదు
- November 07, 2017
ఇరాకీ హౌస్ వైఫ్, ఆమె తల్లి ముగ్గురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వారిపై కేసులు నమోదయ్యాయి. 15, నుంచి 17 ఏళ్ళ వయసున్న ముగ్గురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు 31 ఏళ్ళ గృహిణి ఆమె తల్లి (వయసు 64) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ముందర ఈ కేసు విచారణకు వచ్చింది. 2013లో బలవంతంగా తనను ఈ మురికి కూపంలోకి తీసుకొచ్చారని ఓ బాధితురాలు పేర్కొంది. తనతోపాటు తన సోదరిని కూడా వ్యభిచారంలోకి లాగారని ఆమె వివరించింది. తనతో బలవంతంగా సంతకాలు చేయించుకుని ఈ వ్యభిచారంలోకి దించినట్లు మూడో బాధితురాలు చెప్పింది. 31ఏళ్ళ నిందితురాలి భర్త, బాధితుల్ని ఒక చోట నుంచి ఇంకో చోటకు తరలిస్తూ వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితుల్ని దుబాయ్ ఫౌండేషన్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్‌కి తరలించారు. కేసు తదుపరి విచారణ నవంబర్ 28వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం