అంజీర్ కా మీఠా
- November 07, 2017కావలసిన పదార్ధాలు: ఎండు అంజీరాలు - కిలో, పాలు - అరలీటర్, పంచదార - అరకిలో, నెయ్యి - 200 గ్రా, కోవా - 200 గ్రా, యాలకుల పొడి - టీ స్పూన, బాదం, జీడిపప్పు, పిస్తా - అలంకరణకు సరిపడా.
తయారీ పద్ధతి: అంజీరాల్ని బాగా కడగాలి. గిన్నెలో పాలు పోసి మరిగించి దించాలి. కడిగిన అంజీర్ పండ్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి పాలల్లో వేసి సుమారు 20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఆ తరువాత ఈ మొత్తాన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కోవాతో కలపాలి.
బాణలిలో నెయ్యి వేసి కోవా మిశ్రమాన్ని సిమ్లో సుమారు అరగంటసేపు కలుపుతూ ఉడికించాలి. అందులోనే పంచదారవేసి మరో పది నిమిషాలపాటు కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరగా అయిన తరువాత నెయ్యి రాసిన ప్లేటులో వేసి బాదం, జీడిపప్పు, పిస్తా పప్పులతో అలంకరించి ఆరాక ముక్కలుగా కోస్తే సరి.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ