అబుదాబి హోటల్ గదిలో అగ్ని ప్రమాదంలో 6 గురికి గాయాలు

- November 07, 2017 , by Maagulf
అబుదాబి హోటల్ గదిలో అగ్ని ప్రమాదంలో  6 గురికి గాయాలు

అబుదాబి: సోమవారం రాత్రి  అబుదాబిలోని ఒక హోటల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో సివిల్ డిఫెన్స్ జట్లు తొమ్మిది మందిని రక్షించాయి. అబుదాబి పోలీసులు వెలువరించిన ఒక ప్రకటన ప్రకారం, అగ్నిప్రమాదంలో ఆరుగురికి స్వల్ప గాయాలు కాగా వారిని తక్షణమే ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు.14 వ అంతస్తులో బెడ్ రూమ్ లో తొలుత మంటలు మొదలై  మిగతా గదులకు కారిడార్ కు వ్యాపించినట్లు అబూదాబిలో సివిల్ డిఫెన్స్ జనరల్ డిపార్ట్మెంట్ జనరల్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ మొహమ్మద్ మాయౌఫ్ ఆల్ కిటిబి తెలిపారు.   ఎగిసిపడుతున్న అగ్నిజ్వాలలను ఫైర్ ఫైటర్స్ సమర్ధవంతంగా అదుపుచేసి ఇతర గదులకు వ్యాపించకుండా అదుపుచేసి పలువురి జీవితాలను కాపాడేరు " ఆ  హోటల్ లో  ఏ కారణం వలన మంటలు చెలరేగేయో ఇంకా  నిర్ధారించబడలేదని దీనిపై సమగ్ర విచారణ జరుగుతున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com