'సింగపూర్ తెలుగు సమాజం' అధ్యక్షుడిగా 'కోటిరెడ్డి' ఎన్నిక

- November 08, 2017 , by Maagulf

సింగపూర్: అక్టోబర్ 29 న స్థానిక గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన సింగపూర్ తెలుగు సమాజం 41వ వార్షిక సర్వ సభ్య (AGM) సాధారణ సమావేశంలో 2017-2019 కి నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. రెండు వర్గాల మధ్య హోరా హోరీగా జరిగిన ఎన్నికలలో సుమారు 3000 మంది సమాజం సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంతో ఆసక్తికరంగా జరిగిన ఈ ఎన్నికలలో, కొమ్మిరెడ్డి కోటిరెడ్డి గారు అత్యధిక మెజారిటీతో భారీ విజయం సాధించారు. ఈ సందర్భంగా గెలుపుకి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 

కోటిరెడ్డి గారి ముఖ్య కార్యవర్గంలో  గౌ||కార్యదర్శిగా చిర్ల సత్య , గౌ|| కోశాధికారిగా సత్య సూరిశెట్టి,  ఉపాధ్యక్షులుగా టెకూరి నగేష్ ,కురిచేటి జ్యోతీశ్వర్, మడిపల్లి రామలింగేశ్వర్  మరియు వినయ్ కుమార్ ఎన్నికయ్యారు.

కృష్ణచైతన్య(నిర్వాహక కార్యదర్శి), ఫణింద్ర వర్మ(సహ కోశాధికారి), ప్రాంతీయ కార్యదర్శులుగా అనిల్ పోలిశెట్టి , ప్రదీప్  సుంకర,సిద్దా రెడ్డి, రామకృష్ణారావు, అలాగే కార్యవర్గ సభ్యులుగా సుందర్ నారుమంచి,
మేరువ కాశయ్య,శివ నాగరాజు,రవి కుమార్ సోమ,కురిచేటి స్వాతి,నాగరాజు, బచ్చు ప్రసాద్,అల్లూరి జగదీశ్, సమ్మయ్య, కోమలవల్లి,  గౌ|| ఆడిటర్లు గా 
సుప్రియ కొత్త మరియు మల్లిఖార్జున్ రావు ఎన్నికయ్యారు.

కోటి రెడ్డి గారు మాట్లాడుతూ "మన తెలుగు భాష, సంస్కృతి మరియు సంప్రదాయాలను కాపాడుతూ వాటిని మన భావి తరాలకు అందించడమే ప్రధాన కర్తవ్యము అన్నారు. కార్మిక శ్రేయస్సు, స్త్రీలు కోసం ప్రత్యేక కార్యక్రమాలు మరియు పిల్లలకు యోగ కరాటే డాన్స్ వంటి ఉచిత శిక్షణా తరగతులు వంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సమాజం పురోగతికి ఆహర్నిశలు కష్టపడతామని" అన్నారు.

కుల,మత, ప్రాంత,రాజకీయ విభేదాలు లేకుండా, కార్యవర్గ సభ్యులు అందరూ సింగపూర్ తెలుగు సమాజం శ్రేయస్సు దిశగా పనిచేస్తామని గౌ||కార్యదర్శి సత్య చిర్ల తెలిపారు.

కోటిరెడ్డి గారి వర్గం విజయం సాధించిన సందర్భంగా సింగపూర్ లో ఉన్న తెలుగు వారందరూ హర్షం వ్యక్తం చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com