పాకిస్థాన్‌లో లోయలో పడ్డ బస్సు.. 24 మంది మృతి

- November 08, 2017 , by Maagulf
పాకిస్థాన్‌లో లోయలో పడ్డ బస్సు.. 24 మంది మృతి

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలో పడడం వల్ల సుమారు 24 మంది ప్రయాణికులు మృతిచెందారు. పంజాబ్ ప్రావిన్సులోని అటాక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బుధవారం రాత్రి 9 గంటలకు బస్సు లోయలో పడినట్లు సమాచారం. కోహట్ నుంచి రైవిండ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న జనం అంతా ఓ ధార్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. ఈ ఘటనలో మరో 55 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను రావల్పిండి హాస్పటల్‌కు చేర్పించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com