బ్రిటన్ రాజకీయాల్లో రైజింగ్ స్టార్ మంత్రి ప్రీతీ పటేల్ రాజీనామా
- November 08, 2017
బ్రిటన్ రాజకీయాల్లో రైజింగ్ స్టార్‌గా పేరుగాంచిన భారతీయ సంతతికి చెందిన మంత్రి ప్రీతి పటేల్ రాజీనామా చేశారు. ఆమెపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో ప్రధాని థెరిసా మేకు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కన్జర్వేటి పార్టీకి చెందిన ప్రీతీ పటేల్‌కు బ్రిటన్ రాజకీయ సర్కిల్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ మంత్రిగా ఆమె బ్రిటన్ క్యాబినెట్‌లో ఉన్నారు. అయితే ఇటీవలే ఆమె తన ఫ్యామిలీతో కలిసి ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆమె అనేక మంది వ్యాపారవేత్తలతోనూ, ఆ దేశ ప్రధాని బెంజిమెన్ నెతన్యూతోనూ రహస్యంగా భేటీ అయ్యారు. దీంతో ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఆఫ్రికా పర్యటనలో ఉన్న ఆమెను బ్రిటన్ ప్రభుత్వం అత్యవసరంగా వెనక్కి రప్పించింది. ఆ తర్వాత వెంటనే ఆమె తన రాజీనామాను సమర్పించారు. అయితే బ్రిటన్‌లో గత వారంలోనే అనేక రాజకీయ పరిణామాలో చోటుచేసుకున్నాయి. రక్షణ మంత్రి మైఖేల్ ఫాలన్ లైంగిక ఆరోపణలు రావడంతో రాజీనామా చేశారు. విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ కూడా రాజీనామా చేయాలని ప్రభుత్వంపై వత్తడి పెరుగుతున్నది.
విదేశాలకు వెళ్తూ.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అంశాలను ప్రభుత్వానికి తెలియజేయడం మంత్రులు బాధ్యత. కానీ ప్రీతీ పటేల్ అలా చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







