జనసేన అధినేత పవన్ మనకి ఎన్టీఆర్.. కమల్ వారికి ఎంజీఆర్ అంటున్న నరేష్

- November 09, 2017 , by Maagulf
జనసేన అధినేత  పవన్ మనకి ఎన్టీఆర్.. కమల్ వారికి ఎంజీఆర్ అంటున్న నరేష్

సినిమా బ్యాక్ గ్రౌండ్‌నుంచి వచ్చినా కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకుని తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందరి హీరోల్లా కాకుండా విభిన్నమైన మనస్తత్వంతో ఉంటాడు. తనలో ఏదో ప్రత్యేకత ఉందనే విషయంతో ఎప్పటికప్పుడు అభిమానులను ఆలోచింపజేస్తుంటాడు. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వస్తున్నానంటూ జనసేన పార్టీని కూడా స్థాపించాడు.  ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాల్నీ బ్యాలెన్స్ చేస్తూ ట్విట్టర్ వేదికగా అభిమానులతో ఎప్పడూ టచ్‌లోనే ఉంటారు. ఆ విధంగా పవన్ ట్విట్టర్ అభిమానుల సంఖ్య రెండు మిలియన్లదాకా చేరుకుంది. ట్విట్టర్ వేదికగానే ఆయన ప్రశ్నల పరంపర కొనసాగుతుంటుంది.  

ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు నరేష్ కూడా పవన్ అభిమాని అన్న విషయం చెప్పకనే చెబుతుంది ఈ ట్వీట్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్, తమిళనాడు రాష్ట్రానికి కమల్ హాసన్ ముఖ్యమంత్రులు కావాలని లక్షలాది మంది అభిమానులు కలలుగంటున్నారని ట్విట్టర్‌లో పేర్కొనడమే కాకుండా పవన్ ముఖ్యమంత్రి అయితే స్వర్గీయ నందమూరి తారక రామారావు పాలన వస్తుందని, కమల్ హాసన్ తమిళనాడుకు ముఖ్యమంత్రి అయితే ఎంజీఆర్ పాలన వస్తుందని అభిప్రాయపడ్డారు. నరేష్ ట్వీట్‌కి అభిమానులు కూడా పాజిటివ్‌గా రెస్పాండవుతున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com