హర్ట్ అయిన దేవిశ్రీ..త్రివిక్రమ్ కు నో విషెస్
- November 09, 2017
టాలీవుడ్లో తాను కలిసి పని చేసిన.. తనకు సన్నిహితులైన ఎవరి పుట్టిన రోజు జరిగిన వాళ్లకు తనదైన శైలిలో 'మ్యూజికల్ బర్త్ డే విష్' చెబుతాడు దేవిశ్రీ ప్రసాద్. కానీ మొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా అతడికి దేవి శుభాకాంక్షలు చెప్పకపోవడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. దేవి ఆ రోజు ఏదైనా పనిలో పడి బిజీగా ఉండిపోయాడేమో..
ట్విట్టర్లోకి రాలేదేమో అనుకోవడానికి కూడా లేదు. అదే రోజు కమల్ హాసన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు దేవి. కానీ త్రివిక్రమ్ గురించి మాత్రం పట్టించుకోలేదు. ఒకప్పుడు వరుసగా తనతోనే సినిమాలు చేసిన త్రివిక్రమ్.. ఇప్పుడు తనను పక్కన పెట్టి మిక్కీ జే మేయర్, అనిరుధ్ లాంటి సంగీత దర్శకులతో పని చేస్తుండటంతో దేవి హర్టయ్యాడని.. అందుకే ఉద్దేశపూర్వకంగానే త్రివిక్రమ్‌కు విష్ చేయలేదని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు.
తెలుగు దర్శకుల్లో దేవీకి అత్యంత సన్నిహితుడు సుకుమార్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుక్కు కెరీర్ ఆరంభం నుంచి అతడి ప్రతి సినిమాకూ దేవీనే సంగీతం అందించాడు. సుక్కు తర్వాత దేవి ఎక్కువ సినిమాలకు పని చేసిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీళ్ల కాంబినేషన్లో జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలొచ్చాయి.
త్రివిక్రమ్, దేవి ఎంత క్లోజ్‌గా ఉంటారో చాలా సందర్భాల్లో చూశాం. వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల ఓవరాల్ రిజల్ట్ ఉన్నా.. మ్యూజిక్ పరంగా అన్నీ సూపర్ హిట్లే. వీళ్లిద్దరి టేస్టులు చాలా దగ్గరగా ఉంటాయని కూడా అంటారు. మరి త్రివిక్రమ్ ఉన్నట్లుండి తన ఆస్థాన సంగీత దర్శకుడిని ఎందుకు పక్కన పెట్టేసి వేరే వాళ్లతో పని చేస్తున్నాడో అర్థం కావట్లేదు జనాలకు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష