సౌదీ కింగ్ మరో కీలక నిర్ణయం
- November 09, 2017
సౌదీ కింగ్ మొహమ్మద్ బిన్ సల్మాన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం సౌదీ కింగ్ కొత్తగా 30 మంది జడ్జీలను నియమించడంతో పాటు 26 మందిని ప్రమోట్ చేసినట్టు సౌదీ అరేబియా స్టేట్ న్యూస్ ఏజెన్సీ ఎస్పీఏ రిపోర్టు చేసింది. అవినీతి కేసులో 11 మంది యువరాజులను, నలుగురు మంత్రులను, డజన్ల కొద్దీ మాజీ మంత్రులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ నియామకం, ప్రమోషన్లు చర్చనీయాంశమైంది. సల్మాన్ ఆదేశాలతోనే వీరిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్, లంచం, వ్యక్తిగత లాభం కోసం ప్రభుత్వ కార్యాలయాన్ని దోచుకోవడం, దోపిడీ చేయడం వంటి ఆరోపణలు వీరిపై ఉన్నాయి.
26 మంది జడ్జీలను ప్రమోట్ చేస్తున్నట్టు మరో 30 మందిని జ్యుడీషియరీలో వివిధ స్థానాల్లో నియమిస్తున్నట్టు సౌదీ రాజు రాయల్ ఆర్డర్ జారీచేశారు. అదుపులోకి తీసుకున్న వారి బ్యాంకుల సమాచారం అందించాలని యునిటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రెగ్యులేటర్స్ ఇప్పటికే ఆదేశించాయి. వీలైతే వీరి అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేయాలని పేర్కొన్నాయి. సెంట్రల్ బ్యాంకు ఆదేశాల మేరకు 1700 దేశీయ బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేశామని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







