అమెరికా క్లీవ్ ల్యాండ్ లో బాస్కెట్ బాల్ మ్యాచ్‌లో కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శన

- November 09, 2017 , by Maagulf
అమెరికా క్లీవ్ ల్యాండ్ లో బాస్కెట్ బాల్ మ్యాచ్‌లో కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శన

ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా క్లీవ్ ల్యాండ్ లో.. నేషనల్ బాస్కెట్ బాల్ అకాడమీ  మ్యాచ్ సందర్భంగా తెలుగు సంస్కృతి ,తెలుగు సాంప్రదాయాలను పరిచయం చేసే గొప్ప అవకాశం తానాకు లభించింది. క్లీవ్ లాండ్ కావలిఎర్స్, ఇండియానా పిసర్స్ మ్యాచ్ సందర్భంగా.. తానా ప్రతినిధులతోపాటు.. చిన్నారులందరినీ వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమెరికా.. ఇండియాలో తానా చేపడుతున్న సేవాకార్యక్రమలను వారు ప్రశంసించారు.

 అనంతరం 30 వేల మంది ఆడియన్స్ సమక్షంలో 7 నిముషాల పాటు చిన్నారులు కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెరికా చరిత్రలో మరే తెలుగు సంస్థకు ఈ అవకాశం దక్కలేదని.. తానా  జాయింట్ ట్రెజరర్ అశోక్ కొల్ల అన్నారు. తానా ఆధ్వర్యంలో జరిగిన ఈ గేమ్ ను ఇండియన్ హెరిటేజ్ కమ్యూనిటీ నైట్ గా గుర్తించారని తెలిపారు. ఈ అరుదైన అకాశం రావడానికి కృషి చేసిన వారిని తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ జయ తాళ్లూరి అభినందించారు. భవిష్యత్ లో ఇలాంటివి మరిన్ని చేపడతామని తానా ఫౌండేషన్ ఛైర్మన్ నిరంజన్ శృంగవరపు అన్నారు. ఈ కార్యక్రమంలో డెట్రాయిట్ , కొలంబస్, క్లీవ్ లాండ్  తానా  రీజనల్  కొ ఆర్డినేటర్లు కూడా పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com