ఐరన్‌ దొంగల పట్టివేత: ఇద్దరు పోలీసులకు సన్మానం

- November 10, 2017 , by Maagulf
ఐరన్‌ దొంగల పట్టివేత: ఇద్దరు పోలీసులకు సన్మానం

ఐరన్‌ దొంగల ముఠాని పట్టుకోవడంలో తెగువ చూపినందుకుగాను ఇద్దరు పోలీసు అధికారులను దుబాయ్‌ పోలీస్‌ సన్మానించింది. దుబాయ్‌లోని అల్‌ రషిదియా పోలీస్‌ స్టేషన్‌ యాక్టింగ్‌ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ రషీద్‌ సలె అల్‌ షెహ్హి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాద్‌ ఖయెద్‌ అల్‌ ఫత్తామ్‌, మువాసీద్‌ కాసిమ్‌ చూపించిన తెగవను ఈ సందర్భంగా రషీద్‌ సలె ప్రశంసించారు. నిందితులు ఆసియా జాతీయులు. సుమారు 300,000 దిర్హామ్‌ల విలువైన ఐరన్‌ని ఈ ముఠా దొంగిలించింది. విధి నిర్వహణలో తమదైన ముద్ర వేసే అధికారులను సన్మానించడం ద్వారా ఇతరుల్లోనూ కొత్త ఉత్సాహం నింపాలన్నదే ఈ సన్మానం తాలూకు ముఖ్య ఉద్దేశ్యమని లెఫ్టినెంట్‌ కల్నల్‌ రషీద్‌ అల్‌ షెహ్మి చెప్పారు. స్టేషన్‌ మేనేజ్‌మెంట్‌ తను సత్కరించడం పట్ల ఇద్దరు పోలీసు అధికారులు హర్షం వ్యక్తం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com