ఐరన్ దొంగల పట్టివేత: ఇద్దరు పోలీసులకు సన్మానం
- November 10, 2017
ఐరన్ దొంగల ముఠాని పట్టుకోవడంలో తెగువ చూపినందుకుగాను ఇద్దరు పోలీసు అధికారులను దుబాయ్ పోలీస్ సన్మానించింది. దుబాయ్‌లోని అల్ రషిదియా పోలీస్ స్టేషన్ యాక్టింగ్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ రషీద్ సలె అల్ షెహ్హి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాద్ ఖయెద్ అల్ ఫత్తామ్, మువాసీద్ కాసిమ్ చూపించిన తెగవను ఈ సందర్భంగా రషీద్ సలె ప్రశంసించారు. నిందితులు ఆసియా జాతీయులు. సుమారు 300,000 దిర్హామ్‌ల విలువైన ఐరన్‌ని ఈ ముఠా దొంగిలించింది. విధి నిర్వహణలో తమదైన ముద్ర వేసే అధికారులను సన్మానించడం ద్వారా ఇతరుల్లోనూ కొత్త ఉత్సాహం నింపాలన్నదే ఈ సన్మానం తాలూకు ముఖ్య ఉద్దేశ్యమని లెఫ్టినెంట్ కల్నల్ రషీద్ అల్ షెహ్మి చెప్పారు. స్టేషన్ మేనేజ్మెంట్ తను సత్కరించడం పట్ల ఇద్దరు పోలీసు అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!