పాకిస్తానీయులకు వైద్య వీసా మంజూరు: సుష్మా స్వరాజ్‌

- November 10, 2017 , by Maagulf
పాకిస్తానీయులకు వైద్య వీసా మంజూరు: సుష్మా స్వరాజ్‌

కరాచీ: భారత్‌లో వైద్య నిమిత్తం పాకిస్తానీయులకు మరిన్ని వీసాలు ఇవ్వనున్నట్లు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించిన నేపధ్యంలో తాజాగా శుక్రవారం మరో పాకిస్తాన్‌ జాతీయునికి వీసా మంజూరైంది. భారత్‌లో వైద్య వీసాను అనుమతిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్విటర్‌ ద్వారా శుక్రవారం అమ్నాకు తెలిపారు. కరాచి నుండి అమ్నా అనే యువతి అభ్యర్థన మేరకు ఆమె తండ్రి షమీమ్‌ అహ్మద్‌ వైద్య నిమిత్తం వీసాను మంజూరు చేశారు. దీనికి కొనసాగింపుగా షమీమ్‌ అక్టోబర్‌ 9న కాలేయ మార్పిడి ఆపరేషన్‌కు సహకరించాలని శ్రీ గంగా రామ్‌ ఆసుపత్రి డాక్టర్‌ సూచించిన లేఖను కూడా పోస్ట్‌ చేశారు. భారత్‌, పాక్‌ల మధ్య ఇతర సమస్యలు ఉన్నప్పటికీ, ఈ సంవత్సరం మే నెలలో అప్పటి ప్రధాన మంత్రి, విదేశాంగ వ్యవహారాల సలహాదారుడు శరత్‌ అజీజ్‌ మెడికల్‌ వీసాను ఇవ్వమని భారత్‌ను కోరారు. ఈ లేఖపై పాకిస్తాన్‌ ప్రభుత్వం అప్పట్లో మండిపడింది. పాకిస్తాన్‌ పాలిత కశ్మీర్‌ ప్రాంతంలోని రోగి న్యూఢిల్లీలో ఆపరేషన్‌ చేయించుకోవడానికి వీసా ఇవ్వవలసిందిగా జులై 18న కోరారు. దీనికి సుష్మాస్వరాజ్‌ స్పందిస్తూ పాకిస్తాన్‌ నుండి ఎటువంటి సిఫార్సు అవసరం లేదని, ఎందుకంటే ఆ ప్రాంతం భారతదేశంలో ఓ భాగమని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com