అభిమాని ప్రేమకి ఫిదా అయిన మెగాస్టార్.!
- November 11, 2017_1510410956.jpg)
అభిమానుల్లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జీవితంలో ఆయన్ను ఒక్కసారి నేరుగా చూడాలి, మాట్లాడాలి అనుకునే అభిమానులు ఎంత మందో. ఇటీవల ఓ వీరాభిమాని తన పెళ్లిలో అభిమాన నటుడు చిరంజీవి ఫ్లెక్సీ ఏర్పాటు చేసి, దాని ముందు పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం సోషల్‌మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీన్ని తెలుసుకున్న చిరు తన అభిమాని ప్రేమకు ఫిదా అయ్యారు. ఆప్యాయంగా అతడ్ని, అతడి భార్యని తన ఇంటికి ఆహ్వానించి సర్‌ప్రైజ్ చేశారు. వారితో కలిసి భోజనం చేసి.. నూతన దంపతులకు దుస్తులు కానుకగా ఇచ్చి, ఆశీర్వదించారు.
చిరునే కాదు ఆయన కుమారుడు, హీరో రామ్‌చరణ్ కూడా ఈ నూతన దంపతులతో మాట్లాడారు. 'రంగస్థలం 1985' సెట్‌లో వారితో కాసేపు సమయం గడిపి, ఫొటోలకు పోజులిచ్చారు.
చెర్రీ ప్రస్తుతం 'రంగస్థలం 1985' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తున్నారు. జగపతిబాబు, అనసూయ, ఆది పినిశెట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి'లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష