భారతీయ బాలుడి పుట్టినరోజుని ఘనంగా నిర్వహించిన అబుదాబి పోలీసులు
- November 11, 2017
యూఏఈ : భయం గొల్పే వార్తలతో నిత్యం షాకులిచ్చే పోలీసులు ...సాదుజీవులుగా మారి పిల్లల పుట్టినరోజు పండుగకు కేకులు కోయించడం ఎక్కడైనా జరుగుతుందా ? అబుదాబిలో పోలీసులు ఇటీవల మనసున్న మారాజులుగా మారిపోయారు. ఎంపిక చేసుకొన్న బాలుని పుట్టినరోజుని ముందుగా తెల్సుకొని అక్కడకు వెళ్ళి పుష్పగుచ్ఛాలతో ' హ్యాపీ బర్త్ డే ' అని శుభాకాంక్షలు దీవెనలు తెలియచేస్తున్నారు. ఈ తరహా ఆకస్మిక చర్యలతో అబుదాబి పోలీసులు పలువురి మనస్సులను దోచుకొంటున్నారు. యూఏఈ లో నివాసం ఉంటున్న ఆ ప్రవాస భారతీయ కుటుంబం తమ బాలుడికి ఈ తరహా మర్యాద జరగడం పట్ల ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. తమ 11 ఏళ్ళ బాలుడి పుట్టినరోజు వేడుకకు అనుకోని అతిధులుగా అబుదాబి పోలీసులు యూనిఫారంతో హాజరై పుష్పగుచ్చం అందచేసి బర్త్ డే పార్టీలో ఆ పోలీసులు పెద్ద ఎత్తున అందరూ ఒక్కసారిగా శుభాకాంక్షలు తెలిపారు. "మంచి నమ్మకం 2017" (గుడ్విల్ 2017) వ్యూహంలో భాగంగా ఈ ప్రయత్నం స్థానికంగా అందరికి సంతోషం కల్గించింది. అంతేకాక ఆ బాలుడికి తమ పోలీస్ యూనిఫారం ధరింపచేసి తమ గస్తీ వాహనంలో ఆ బాలుని అతని తల్లిదండ్రులు ఇంటి నుండి అల్ రౌదా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు , అక్కడ పోలీసు స్టేషన్ డైరెక్టర్ హమాద్ అబ్దుల్లా అల్ అఫారి నుంచి హుందాగా ఒక కరచాలనం పుట్టినరోజు శుభాకాంక్షలు దర్జాగా ఆ బాలుడు అందుకున్నాడు. అవగాహన కేంద్ర భవనంలో ఆ బాలుడు పోలీసుల సమక్షంలో ఒక కేక్ ను ముక్కలుగా అందరికి పంచిపెట్టాడు. అనంతరం పోలీస్ మామయ్యలు పలు బహుమతులు ఆ బాలునికి అందచేశారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







