కతార్, అల్ ఖోర్ లో వొకొద్ వారి 28వ సర్వీస్ స్టేషన్

- November 09, 2015 , by Maagulf
కతార్, అల్ ఖోర్ లో వొకొద్ వారి 28వ సర్వీస్ స్టేషన్

కతార్ ఫ్యూయల్ (వొకొద్) వారు తమ అతిపెద్ద 28వ సర్వీస్ స్టేషన్ ను అల్ ఖోర్  థాకిరా ఏరియా లో, చైర్మన్ షేక్ సౌద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ హస్సన్ అల్-థాని , సి. ఈ. ఓ. ఇంజనీర్ ఇబ్రహీం - అల్ - కువారి, బోర్డు మెంబర్లు, ఇతర మేనేజ్ మెంట్ సిబ్బంది, వివిధ వ్యాపార రంగాల నుండి వచ్చిన హై ప్రొఫైల్ అతిధుల మధ్య ప్రారంభించబడింది. ఈ సర్వీస్ స్టేషన్ లో 24 గంటలు పనిచేసే మూడు ఫ్యుయలింగ్ ఐలాండ్ లు, ఆరు డిస్పెంసర్లతో కూడిన , ఉన్నాయి.  కతార్ లోని ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా చేరుకొని, సేవలందించాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని, రానున్న రోజుల్లో పెరగనున్న జనాభా అవసరాలకు అనుగుణంగా థాకిరా సర్వీస్ స్టేషన్ సేవనందించగలదని చెప్పారు. ఇంకా నిర్మాణంలో ఉన్న 12 సర్వీస్ స్టేషన్ లు ఈ సంవత్సరాంతంలో కొన్ని,  వచ్చే సంవత్సర ప్రారంభంలో మరి కొన్ని ప్రారంభించబడతాయని వెల్లడించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com