కాలుష్యం కారణంగా అస్తవ్యస్తంగా మారిన రవాణా వ్యవస్థ

- November 12, 2017 , by Maagulf
కాలుష్యం కారణంగా అస్తవ్యస్తంగా మారిన రవాణా వ్యవస్థ

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన న్యూఢిల్లీలో కాలుష్యం శాతం పెరుగుతోంది. అంతేకాదు, ఢిల్లీలో కాలుష్యం స్థాయిని తెలుపుతూ ప్రపంచ పర్యావరణ సంస్థ హెచ్చరికలు జారీ చేసిన విషయం విధితమే. ఇప్పుడు ఇదే విషయం దేశమంతటా చర్చనీయాంశమైంది. దీంతో మేల్కొన్న ప్రభుత్వం కాలుష్య నివారణకు ఇప్పుడిప్పుడే చర్యలను ముమ్మరం చేసింది కూడాను.
అయితే, తాజా సమాచారం మేరకు ఢిల్లీలో కాలుష్యం ప్రభావం కారణంగా 34 రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. అంతేకాక 21 రైళ్ల సమయాల్లో మార్పు, ఎనిమిది రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు ఉన్నతాధికారులు.
అయితే, గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి పెరిగిపోవడంతో తమ కార్యాలయాలకు వెళ్లాల్సిన ప్రజలకు కాలుష్యంతో కూడిన పొగమంచు దుప్పటిలా కప్పబడటం వల్ల రోడ్లపై వచ్చే వారు కూడా సరిగా కనిపించలేదు. పశ్చిమ ఢిల్లీలో గాలి కలుషితమై ఆందోళనకరంగా మారింది. ఇదే కాలుష్యం మరో మూడు రోజులు కొనసాగితే, పాఠశాలలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించే యోచనలో ఉంది ప్రభుత్వం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com