ఖుర్మ్‌ బీచ్‌లలో ఎల్‌ఈడీ లైట్లు: మస్కట్‌ మునిసిపాలిటీ

- November 13, 2017 , by Maagulf
ఖుర్మ్‌ బీచ్‌లలో ఎల్‌ఈడీ లైట్లు: మస్కట్‌ మునిసిపాలిటీ

మస్కట్‌: మస్కట్‌ మునిసిపాలిటీ ఖుర్మ్‌ ప్రాంతంలోని బీచ్‌ రోడ్లపై ఎల్‌ఈడీ స్ట్రీట్‌ లైట్స్‌ని ఏర్పాటు చేస్తోంది. అల్‌ షట్టి స్ట్రీట్‌ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ లైట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మునిసిపాలిటీ అధికారి ఒకరు చెప్పారు. పాత ఎల్లో లైట్స్‌ని కొత్త లైట్లతో రీప్లేస్‌ చేస్తున్నారు. వింటర్‌ సీజన్‌లో పర్యాటకులకు ఈ లైట్లు బీచ్‌లో కొత్త అనుభూతిని కలిగిస్తాయని ఆ అధికారి వివరించారు. బీచ్‌ వ్యాప్తంగా పర్యాటకులు పలు రకాలైన ఆటల్ని ఎంజాయ్‌ చేయడానికి ఇష్టపడ్తారనీ, వీకెండ్స్‌లో ఎక్కువగా బీచ్‌లోకి సందర్శకులు వస్తుంటారనీ, అలాంటివారికోసం మెరుగైన వసతుల్ని కలిగిస్తున్నామని మునిసిపాలిటీ పేర్కొంది. ఈ ప్రాంతంలో మస్కట్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన హోటల్స్‌ సందర్శకులకు, పర్యాటకులకు విశేషమైన సేవల్ని అందిస్తున్నాయి. ఇతర బీచ్‌లలో కూడా ఇదే తరహా లైటింగ్‌ ఏర్పాట్లు చేస్తామని అధికారులు అంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com