తొలి 100 మందికి టిక్కెట్‌ హోల్డర్స్‌కి బిగ్‌ ఆఫర్స్‌

- November 13, 2017 , by Maagulf
తొలి 100 మందికి టిక్కెట్‌ హోల్డర్స్‌కి బిగ్‌ ఆఫర్స్‌

మనామా: బ్రేవ్‌ కంబాట్‌ ఫెడరేషన్‌, ఫైట్‌ నైట్‌ - బ్రేవ్‌ 9 ఈవెంట్‌కి వచ్చే తొలి వంద మంది టిక్కెట్‌ హోల్డర్స్‌కి బిగ్‌ ఆఫర్స్‌ని ప్రకటించింది. 'కింగ్‌డమ్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌ బిగ్‌-9 నైట్‌ ఫైట్‌కి మంచి క్రేజ్‌ ఏర్పడ్డ సంగతి తెలిసినదే. తొలి 100 మంది టిక్కెట్‌ హోల్డర్స్‌కి టి షర్ట్‌లు, ఆటోగ్రాఫ్‌ చేసిన హ్యాట్స్‌, గిఫ్ట్‌ ప్యాక్స్‌ బహుమతులుగా అందజేస్తారు. తొలి 50 మంది అభిమానులు, సెలబ్రిటీ కార్డ్‌ గెలుపొందే అవకాశం కలిగి ఉంటారు. తమకు నచ్చిన సెలబ్రిటీతో కలిసి, వారితో ఫొటోలు తీసుకునే అవకాశం ఉంది. నవంబర్‌ 17న ఖలీఫా స్పోర్ట్స్‌ సిటీ వద్ద 3.30 గంటలకు గేట్స్‌ తెరవబడ్తాయి. అతిఫ్‌ మొహమ్మద్‌ - హైదర్‌ ఫర్మాన్‌ మధ్య పోటీ జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com