జీఎస్టీ ఎఫెక్ట్: రూపాయి బలహీనం డాలర్ కి బలం
- November 13, 2017
దేశీయ కరెన్సీ రూపాయి విలువ సోమవారం భారీగా క్షీణించింది. జీఎస్టీ కౌన్సిల్ పన్ను రేట్లపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో భారీ ఆర్థిక భారం పడనుందనే భయంతో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. కౌన్సిల్ తాజా నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థపై సంవత్సరానికి రూ .20వేల కోట్ల భారనుంది. డాలర్ మారకరంలో 20 పైసలు క్షీణించి రూ.65.36 కు చేరుకుంది.
మరో వైపు డాలర్ బలం కూడా రూపీ విలువ క్షీణతకు దాసింది. ఇతర కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ బలం, విదేశీ ఫండ్ ప్రవాహాలు కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచాయి. దిగుమతిదారులు, బ్యాంకుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ తో రూపాయి విలువ పతనం కారణమని డీలర్స్ భావిస్తున్నారు.
దీంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఈక్విటీ మార్కెట్లనుంచి రూ.529 కోట్ల మేర పెట్టబడులును శుక్రవారం ఉపసంహరించుకున్నారు. శుక్రవారం ముగింపులో రూపాయి 22పైసలు కోల్పోయి రూ.65.16వద్ద ముగిసింది. మరోవైపు దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం