జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వనున్న కెసిఆర్

- November 13, 2017 , by Maagulf
జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వనున్న కెసిఆర్

రైతులకు రూ.8వేల పెట్టుబడి సాయం వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో ప్రకటించారు. రైతులకు పెట్టుడి సాయంపై సభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో గ్రామీణ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని అన్నారు. గతంలో చాలా వ్యవస్థలు, నిధులు గ్రామ, మండల సమితుల చేతుల్లో ఉండేవని.. కాంగ్రెస్‌ పార్టీ వాటిని కేంద్రీకృతం చేస్తే.. భాజపా ప్రభుత్వం అదే విదానాన్ని కొనసాగిస్తోందన్నారు. జనవరి 1 నుంచి రైతులకు 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేయనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు.
విపక్షాలు అనవసర విమర్శలు మానుకొని ప్రభుత్వానికి సహకరించాలని కేసీఆర్‌ కోరారు. ప్రాజెక్టులు పూర్తికాకూడదు, చెరువులు నిండకూడదు, ప్రజలకు తాగునీరు అందకూడదని కాంగ్రెస్‌ నేతలు కోరుకుంటున్నారని మండిపడ్డారు. రైతులకు న్యాయం చేసేది తెరాస మాత్రమేనని.. అందుకే రైతు సమన్వయ సమితుల్లో తెరాస కార్యకర్తలే ఉంటారని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు ఆపాలన్నదే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమన్నారు.ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైనే 196 కేసులు వేశారని తెలిపారు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com