ఆస్ట్రేలియాలో ఓ యువతి వింత ప్రేమకథ
- November 13, 2017
ఆస్ట్రేలియాకు చెందిన ఐలా అనే యువతి ప్రేమ కథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రియుడు డేవిస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో.. ఆమె కలలన్ని తుడిచిపెట్టుకుపోయాయి.
అయితే అక్కడితో ఆమె కుంగిపోలేదు. తాను ప్రేమించిన వ్యక్తి చనిపోయినా సరే.. అతని ద్వారా పిల్లలను కనాలనుకుంది. మృతి చెందిన వ్యక్తితో పిల్లలు కనడం సాధ్యమేనా? అని ఆమె వెనుకగడుగు వేయలేదు. ఐవీఎఫ్ పద్దతిలో కృత్రిమ గర్భదారణ ద్వారా పిల్లలను కనాలనుకుంది.
ఇందుకోసం డేవిస్ వీర్యంతో పిల్లలను కనేందుకు అనుమతించాలని కోరుతూ అక్కడి కోర్టుకు తెలియజేసింది. కాగా ఐవీఎఫ్ పద్దతిలో కృత్రిమ గర్భదారణ విధానం (ఐవీఎఫ్) ద్వారా ఓ క్లినిక్ లో ఈ ప్రక్రియను చేపట్టాలని న్యాయస్థానం కూడా అనుమతినిచ్చింది. దీంతో ఐలా కోరిక నెరవేరనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తా కథనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







