బైక్ రైడర్స్ కి కేంద్రం ట్రిపుల్ షాక్
- November 13, 2017
ఒక్క బండి.. ముగ్గురు ఉన్నారు. పర్వాలేదు ఎక్కండి చిన్నగా వెళ్లదాం అంటాం. అదే లేడీస్ అయితే పోలీసోళ్లు కూడా ఆపరులే అనే దీమా. ఇక నుంచి ఇలాంటివి జాన్తానై అంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ట్రిపుల్ రైడింగ్ కి జరిమానాగా వెయ్యి రూపాయలు ఇప్పటి వరకు వసూలు చేసేవారు. ఇక నుంచి మూడు వేల రూపాయల ఫైన్ వేయనున్నారు. బండి నడిపే వ్యక్తికి వెయ్యి కట్టాల్సి ఉంటే.. వెనక కూర్చున్న ఇద్దరూ కూడా తలో వెయ్యి రూపాయలు జరిమానా కింద కట్టాలి. హైదరాబాద్ బైక్ రైడర్స్ కు షాకింగ్ లాంటి ఈ డెసిషన్ ను అమలు చేయబోతున్నారు ట్రాఫిక్ పోలీసులు.
ముఖ్యంగా యువతలో మార్పు కోసం ఈ కఠిన నిబంధన అమలు చేస్తున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ 188 కింద వెయ్యి ఫైన్ వేస్తున్నారు. అయినా యూత్ లో మార్పు రాలేదు. కేవలం రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే ఐదు నెలల్లో 10వేల ట్రిపుల్ రైడింగ్ కేసులు నమోదు అయ్యాయి. 10 లక్షల రూపాయల ఫైన్ విధించారు.
కేసులు నమోదు చేసి.. కుర్రోళ్ల తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇస్తున్నారు. యువతకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయినా రోజు రోజుకి కేసులు పెరగటంతో ట్రిపుల్ రైడింగ్ లో ఉండే మిగతా ఇద్దరికీ ఫైన్ వేసే విధంగా చట్టాన్ని సవరించాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ట్రాఫిక్ డిపార్ట్ మెంట్.
ట్రిపుల్ రైడింగ్ చట్టాన్ని కఠినతరం చేస్తూ.. ఈ నిబంధనలను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అమలు చేసే విధంగా నివేదికను తయారు చేస్తున్నారు. బైక్ నడిపే వ్యక్తితోపాటు వెనక కూర్చున్న మిగతా ఇద్దరికీ కూడా చెరో వెయ్యి రూపాయల జరిమానా విధిస్తే.. మార్పు వస్తుందని భావిస్తున్నాం అంటున్నారు రాచకొండ అధికారులు.
నివేదిక తుదిరూపు తర్వాత ప్రభుత్వ నిర్ణయం మేరకు మాత్రమే అమలు చేస్తామని వెల్లడించారు. అప్పటి వరకు ఇప్పటి రూల్సే అమల్లో ఉంటాయన్నారు.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్‌పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









