నా 'బుల్లి ఫ్రెండ్'ని కలిశా.. వాడు పోలీసవుతాడట!
- November 13, 2017
ఇదొక ఆత్మీయ కలయిక. ఒక వైపు ఏషియాన్ సదస్సు, మరోవైపు దానికొచ్చిన మిగతా దేశాధినేతలతో పలకరింపులు, డిన్నర్ మీటింగులు! ఫిలిప్పైన్స్ టూర్ లో ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ తో సతమతమవుతున్నారు. అయినా కాసింత తీరిక చేసుకుని మనీలాలోని 'మహావీర్ ఫిలిప్పైన్ ఫౌండేషన్'కి వెళ్లారు మోదీ.
అక్కడున్న అనేక మంది వికలాంగుల్ని పరామర్శించారు. కార్లో మిగెల్ అనే తొమ్మిదేళ్ల కుర్రాడినయితే ప్రత్యేకంగా దగ్గరకు తీసుకుని.. ముద్దాడారు. అతడి మోకాళ్ళ కింద అమర్చిన 'జైపూర్' కృత్రిమ కాలు ఎలా పనిచేస్తుందో అడిగి తెలుసుకున్నాడు.
''ఒక కాలు లేకపోతేనేం.. పెద్దయ్యాక ఈ జైపూర్ కాలుతోనే పోలీస్ నవుతా'' అంటూ ఆ పిల్లాడు చెప్పిన మాటల్ని విని మురిసిపోయారు మన ప్రధాని మోది! ఈరోజే నా 'బుల్లి ఫ్రెండ్'ని కలిశా.. వాడు పోలీసవుతాడట.. అంటూ ట్విట్టర్ లో పోస్ట్ కూడా పెట్టారు.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







