ఆత్మబలిదానం చేసుకున్న అమరుల కుటుంబాలను ఆదుకో కేసీఆర్ - రేవంత్
- November 13, 2017
అట్నుంచి నరుక్కొస్తున్న రేవంత్ రెడ్డి! అవును.. శత్రువుల అంచనాలకు అందకుండా స్కెచ్చులు గీయడమే అసలైన యుద్ధం! ఊహకందని రీతిలో పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ స్ట్రాటజీ ఏమిటన్నది ఇప్పటికీ మిస్టరీనే! ఆయన చేసిన రాజీనామా కూడా అంతే! ఒక అంతులేని కథ! రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకునే కీలక నిర్ణయం మీద రేవంత్ రాజీనామా ఆధారపడి వుంది. ఆ విషయాన్ని అటుంచితే.. నా ఫైటింగ్ కేసీఆర్‌తోనే అంటూ ఎప్పుడూ చెప్పే రేవంత్.. కేసీఆర్‌ని ఎలా ఢీకొడతాడన్న సస్పెన్స్‌ని మాత్రం విప్పడం లేదు. ఈ టాక్ ఇలా కొనసాగుతుండగానే.. సీఎం కేసీఆర్‌కి రేవంత్ ఒక లేఖ రాశారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న అమరుల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందన్నది ఆ లేఖ సారాంశం.
నిజామాబాద్ జిల్లాకు చెందిన సాయాగౌడ్ అనే వ్యక్తి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసుకున్నాడని, ఆ విషయం రికార్డుల్లో కూడా ఉందని రేవంత్ ఆ లేఖలో పేర్కొన్నారు. నిజామాబాద్ కలెక్టర్ నివేదిక పంపినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నది అభియోగం. సాయాగౌడ్ కుటుంబానికి తక్షణం సాయం చేయాలని, ఇలా నిర్లక్ష్యానికి గురైన అమరుల కుటుంబాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయని రేవంత్ ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఆత్మబలిదానాల సంఖ్యకు సంబంధించి ఉద్యమ సమయంలో ఒక లెక్క.. ప్రభుత్వం ఏర్పాటయ్యాక మరో లెక్క ప్రచారంలో వుంది. ఈ అంశాన్ని సూటిగా ప్రస్తావించి కేసీఆర్ సర్కార్‌ని ఇరుకున పెట్టాలన్నది రేవంత్ మొదటి స్కెచ్ గా తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







