తిరువనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న విమానంలోని ల్యాప్‌టాప్ నుంచి మంటలు
- November 13, 2017
తిరువనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న విమానంలోని ఓ ల్యాప్‌టాప్ నుంచి మంటలొచ్చాయి. వెంటనే అగ్నిమాపక పరికరంతో మంటలను అదుపు చేసినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ సోమవారం పేర్కొంది. ఈ ఘటన శనివారం జరిగింది. ‘తిరువనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న 6ఈ445 విమానం క్యాబిన్లో పొగ వాసన వచ్చింది. సీట్ హ్యాట్–ర్యాక్ నుంచి మంటలు వస్తున్నట్లు సిబ్బంది గుర్తించారు. హ్యాండ్‌బ్యాగ్‌లో కాలుతున్న ల్యాప్‌టాప్‌ను అగ్నిమాపక పరికరంతో అదుపులోకి తీసుకొచ్చారు. నీళ్లతో నింపిన కంటైనర్‌లో ల్యాప్‌టాప్‌ను ఉంచారు. బెంగళూరు ఎయిర్‌పోర్టులో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఘటన జరిగిన సమయంలో 186 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం