ఫిలిప్పీన్స్లో ట్రంప్‌ వ్యతిరేక ఆగ్రహ జ్వాలలు

- November 13, 2017 , by Maagulf
ఫిలిప్పీన్స్లో ట్రంప్‌ వ్యతిరేక ఆగ్రహ జ్వాలలు

యూఎస్‌ ఎంబసీ ముందు ఉద్రిక్తత 
- అమెరికా అధ్యక్షుడి దిష్టిబొమ్మదహనం 
- నిరసనకారులపై వాటర్‌కెనాన్స్‌ ప్రయోగం 
ఫిలిప్పీన్స్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి. ఆసియాన్‌ సదస్సు ప్రారంభమైనప్పటి నుంచి మనీలాలో ట్రంప్‌ పర్యటనను వ్యతిరేకిస్తూ వందలాది మంది నిరసనకారులు వీధుల్లోకి చేరుకుని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం మనీలాలోని యూఎస్‌ దౌత్య కార్యాలయం వద్దకు ఆందోళనకారులు భారీ ర్యాలీగా చేరుకున్నారు. ట్రంప్‌నకు వ్యతిరేకంగా నినాదాలు చేయటం మొదలుపెట్టారు. ట్రంప్‌ డౌన్‌ డౌన్‌ అంటూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు.ప్రధాన రహదారిపై బైటాయించి నిరసన తెలిపారు. ఈ లోపు కొందరు ట్రంప్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అప్పటికే ఆ మార్గలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఓవైపు నిరసనకారులు,మరోవైపు భారీగా మొహరించిన పోలీసులతో యూఎస్‌ ఎంబసీ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.

నిరసనకారులను అదుపుచేయటం సాధ్యంకాకపోవటంతో.. దీంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వాటర్‌కెనాన్స్‌ ప్రయోగించారు.పలువురిపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. మీడియా ప్రతినిధులకూ గాయలయ్యాయి.

కాగా, అమెరికా, ఫిలిప్పీన్స్‌ మధ్య కొంతకాలంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నవారిపై, సరఫరా చేస్తున్న వారిపై ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు డ్యుటెర్టే ఉక్కుపాదం మోపారు. మాదకద్రవ్యాల ముఠాలను మట్టుబెట్టాలని ప్రత్యేక బలగాలను ఆదేశించారు. డ్యుటెర్టే చర్యలు అంతర్జాతీయ మానవహక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని ట్రంప్‌ విమర్శించారు.

దేశ ప్రజలంతా డ్యుటెర్టే చర్యలపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని పిలుపునిచ్చారు. ట్రంప్‌ చర్యలపై డ్యుటెర్టే ఆగ్రహం వ్యక్తం చేసి బహిరంగ విమర్శలూ చేశారు. ఇరుదేశాధినేతల మధ్య ట్విట్టర్‌ వార్‌ జరిగింది. ఇందులో భాగంగా ట్రంప్‌ ఫిలిప్పీన్స్‌లో పర్యటించడాన్ని ఇక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com