అద్భుత ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌టెల్
- November 14, 2017
భారత టెలికం రంగంలోని పోటీని దృష్టిలో ఉంచుకొని దేశంలోనే అతి పెద్ద నెట్‌వర్క్ సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీ పెయిడ్ వినియోగదారులకు అద్భుత ఆఫర్ ప్రకటించింది. రూ.3,999తో రీఛార్జీ చేసుకుంటే ఏడాది పాటు అన్ని లోక్‌ల్, ఎస్టీడీ కాల్స్‌ను ఉచితంగా అందిస్తోంది. అంతేకాకుండా 300 జీబీ డేటాతోపాటు ప్రతిరోజు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పంపే సదుపాయముంది. ఈ మేరకు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించిందిఈ ఆఫర్‌తోపాటు మరి కొన్ని కాంబో ప్యాక్‌లను కూడా ఎయిర్‌టెల్ సంస్థ ప్రకటించింది. 1999తో రీఛార్జ్ చేయించుకుంటే 180 రోజుల పాటు అన్ని లోకల్, ఎస్టీడీ కాల్స్ తోపాటు 125జీబీ డేటాను పొందవచ్చు. అదనంగా రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా చేసుకునే వీలుంటుంది. రూ. 999తో రీఛార్జ్‌చేయించుకుంటే 90 రోజుల పాటు అన్ని లోకల్,ఎస్టీడీ కాల్స్ ఉచితంగా పొందవచ్చు. 60 జీబీ డేటాతోపాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు అదనంగా ఇస్తారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







