కేసర్ ఫిర్నీ
- November 15, 2017కావలసిన పదార్థాలు: పాలు - ఒక లీటరు, బాస్మతి బియ్యం - నూరు గ్రాములు,పంచదార - 200 గ్రాములు, కుంకుమపువ్వు - ఒక గ్రాము, పిస్తా పొడి - ఐదు గ్రాములు, ఏలకుల పొడి - ఐదు గ్రాములు.
తయారుచేసే విధానం
బాస్మతి బియ్యాన్ని కడిగి అరగంట నానబెట్టాక, బియ్యాన్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న బియ్యానికి రెండు వందల మి.లీ. పాలు కలిపి పక్కనుంచుకోవాలి. ఒక పాత్రలో మిగిలిన పాలు పోసి స్టౌ మీద పెట్టి చిక్కబడి మూడో వంతు అయ్యేదాకా మరిగించుకోవాలి. అప్పుడు పంచదార, యాలకుల పొడి వేసి కలపండి. పంచదార కరిగిన తర్వాత పాలల్లో బియ్యం మిశ్రమాన్ని పోసి కలపాలి. బియ్యం మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. దించేముందు పిస్తాపప్పు ముక్కల్ని, కుంకుమ పువ్వుని వేసి బాగా చల్లబరచడానికి రిఫ్రిజిరేటర్లో పెట్టి ఆ పైన తింటే చాలా రుచిగా ఉంటుంది
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం